మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది.
ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిలో మొత్తం 15 ఖాళీనలు భర్తీ చేయనున్నారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… సీనియర్ మేనేజర్- లార్జ్ కార్పొరేట్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ 1, సీనియర్ మేనేజర్- రిటైల్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ 1, ఎన్‌బీఎఫ్‌సీ అండ్ ఎఫ్‌ఎల్ సెక్టార్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ 2, సీనియర్ మేనేజర్- క్లైమేట్ రిస్క్ & సస్టైనబిలిటీ 2, సీనియర్ మేనేజర్- బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ అండ్ ఎఫ్‌ఎల్ సెక్టార్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ 2, సీనియర్ మేనేజర్- రిటైల్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ 1, సీనియర్ మేనేజర్- ఎంటర్‌ప్రైజ్ అండ్ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్‌మెంట్ 3, సీనియర్ మేనేజర్- రూరల్ & అగ్రికల్చర్ లోన్స్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ 1, సీనియర్ మేనేజర్ పోర్ట్‌ఫోలియో మానిటరింగ్ & క్వాలిటీ కంట్రోల్ 1 వున్నాయి.
అలానే సీనియర్ మేనేజర్- ఫ్రాడ్ ఇన్సిడెంట్స్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ 2 పోస్టులు వున్నాయి. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం పూర్తి చేసిన వాళ్ళు అర్హులే. అలానే అనుభవం కూడా ఉండాలి. ఆన్‌లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు ముంబయి లో పని చెయ్యాలి. అప్లై చేసుకోవడానికి 24-01-2023 చివరి తేదీ. పూర్తి వివరాలని https://www.bankofbaroda.in/ లో చూడచ్చు.