నిరుద్యోగులకు శుభవార్త… ఇండియా పోస్ట్ లో ఖాళీలు…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియా పోస్టు తాజాగా ఒక నోటిఫికేషన్ ని తీసుకు వచ్చింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియా పోస్టు మోటార్ వెహికల్ మెకానిక్, మోటార్ వెహికిల్ ఎలక్ట్రీషియన్, టైర్ మ్యాన్ మొదలైన పోస్టులని భర్తీ చేస్తోంది.

 

indian post

మొత్తం 17 ఖాళీలు వున్నాయి. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 11ను ఆఖరి తేదీ. సంబంధిత ట్రేడ్ లో టెక్నికల్ ఇనిస్ట్యూషన్ నుంచి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోచ్చు. లేదు అంటే అభ్యర్థులు ఎనిమిదో తరగతి పాసై సంబంధిత ట్రేడ్ లో ఏడాది విద్యార్హత కలిగి వున్నా అప్లై చేసుకోచ్చు. ఇది ఇలా ఉండగా మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టులకు అప్లై చేసే వారికి హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుంది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. మోటార్ వెహికిల్ మెకానిక్ 6 పోస్టులు, మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు, టైర్ మ్యాన్ 3 పోస్టులు, పెయింటర్ 2 పోస్టులు, ఫిట్టర్ 2 పోస్టులు, కాపర్ అండ్ టిన్ స్మిత్ 1 పోస్టు, అప్ హోల్డర్ 1 పోస్టు.

దరఖాస్తులు డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా చేరేలా పంపాలి. స్పీడ్/రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ ఫామ్ ని పంపాల్సిన చిరునామా The Senior Manager, Mail Motor Service, C-121, Naraina Industrial Area Phase-1, Naraina, New Delhi-110028.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version