హుజూరాబాద్ ఫలితాల పై “కాయ్ రాజా కాయ్”…!

-


హుజురాబాద్ ఉపఎన్నిక‌లు పూర్త‌వ‌డంతో ఇప్పుడు ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో జోరుగా బెట్టింగ్ లు కొన‌సాగుతున్నాయి. అయితే తెలంగాణలోని ఎన్నిక‌ల‌కు ఏపీ లోనూ బెట్టింగ్ లు వేయడం విశేషం. హుజురాబాద్ ఎన్నిక‌లు దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల‌పై ఏపీలోనూ బెట్టింగ్ రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు.

కేవ‌లం గెల‌పు పైనే కాకుండా మెజారిటీ ఎవ‌రికి వ‌స్తుందా అని కూడా బెట్టింగ్ లు కాస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక ఇటీవ‌ల మా ఎన్నిక‌లకే బెట్టింగ్ లు వేశారంటే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు బెట్టింగ్ లు వేయ‌డంలో ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఇది ఇలా ఉంటే హుజురాబాద్ ఎన్నిక‌ల బ‌రిలో బీజేపీ నుండి ఈటెల రాజేంద‌ర్ పోటీ చేయ‌గా టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ మ‌రియు కాంగ్రెస్ నుండి వెంక‌ట్ లు బ‌రిలోకి దిగారు. ఇక వీరిలో ఎవ‌రు గెలుస్తారా అన్న‌ది చూడాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version