దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే ఈ సేవలు మీకు ప్లస్ అవుతాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ పొందేవాళ్ళకి రిలీఫ్ కలగనుంది. వారి కోసం వీడియో కాల్ సర్వీసులుని అందుబాటులోకి తీసుకొచ్చింది.
వీడియో లైఫ్ సర్టిఫికెట్ అనే కొత్త సేవల ద్వారా ఇంటి నుంచి లైఫ్ సర్టిఫికెట్‌ను పెన్షనర్లు ఇవ్వచ్చు. ఈ సేవలు నవంబర్ 1 నుంచి అంటే నేటి నుండి అమలులోకి రానున్నాయి. దీని కోసం మళ్ళీ ప్రత్యేకంగా బ్యాంక్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
గవర్నమెంట్ సర్వీసుల నుండి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ లైఫ్ సర్టిఫికెట్ ని తప్పక ఇవ్వాలి. లేదు అంటే పెన్షన్ రాదు. మీరు లైఫ్ సర్టిఫికెట్ అందించాలని అనుకుంటే ఎస్‌బీఐ పెన్షన్ సేవా పోర్టల్‌లోకి వెళ్లి వీడియో లైఫ్ సర్టిఫికెట్ VLC అనే దానిని క్లిక్ చేసి, పెన్షన్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వీడియో కాల్ చేయాలి అంతే.