ఇండియన్‌ సెక్యురిటీ ప్రెస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెక్యురిటీ ప్రింటింగ్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను చూస్తే..

సెక్యురిటీ ప్రింటింగ్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లో 85 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ప్యాస్ అయినా వారు అప్లై చేసుకోవచ్చు.

లేదంటే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన వారైనా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్‌, కంట్రోల్‌, టెక్‌ సపోర్ట్‌-డిజైన్‌, మెషిన్‌ షాప్‌ వంటి విభాగాల్లో పని చేయాల్సి వుంది. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లకు మించకుండా ఉండాలని నోటిఫికేషన్ లో చెప్పారు. అప్లై చేసుకునేందుకు ఆఖరి తేదీ నవంబర్‌ 8, 2022.

ఇక దరఖాస్తు ఫీజు గురించి చూస్తే.. జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.600 చెల్లించాల్సి వుంది. అదే ఎస్సి/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.200 ని చెల్లించాల్సి వుంది. ఇక సాలరీ విషయానికి వస్తే..రూ.18,780ల నుంచి రూ.67,390లు జీతంగా చెల్లించనున్నారు. పూర్తి వివరాలను ఈ కింద లింక్ లో చూడచ్చు. అలానే దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు కూడా.

లింక్: https://ibpsonline.ibps.in/ispnjtwnov20/basic_details.php

 

Read more RELATED
Recommended to you

Latest news