మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. ముంబయిలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో 137 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. ఆపరేటర్(కెమికల్ ట్రెయినీ) – (133), జూనియర్ ఫైర్‌మెన్ – (04) ఖాళీలు ఉన్నాయి.
ఇక అర్హతల వివరాల లోకి వెళితే.. ఆపరేటర్(కెమికల్ ట్రెయినీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేసుండాలి. వయసు 01-03-2022 నాటికి 29 ఏళ్లు మించకూడదు. ఇక జూనియర్ ఫైర్‌మెన్ పోస్టుల వివరాల లోకి వెళితే.. జూనియర్ ఫైర్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 6 నెలల ఫుల్‌టైం ఫైర్‌మెన్ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. అలానే ఏడాది అనుభవం ఉండాలి. వయసు 01.03.2022 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఆన్లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే.. ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,000 నుంచి రూ.60,000 వరకు ఇస్తారు. అదే జూనియర్ ఫైర్‌మెన్ పోస్టులకు అయితే రూ.18,000 నుంచి రూ.42,000 చెల్లిస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 28-03-2022. పూర్తి వివరాలని https://www.rcfltd.com/ లో చూడచ్చు.