టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు నేడు ఈడీ ముందుకు ర‌కుల్..!

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసును ఈడీ డీల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట ఈ కేసులో ఎక్సైజ్ శాఖ ప‌లువురిని విచారించింది. కాగా ప్ర‌స్తుతం ఈ కేసు ఈడీ చేతికి రావ‌డం ఆస‌క్తిరేపుతోంది. ఇక ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాత్, ఛార్మీ కౌర్ ల‌ను ఈడీ ప్ర‌శ్నించింది. నిన్న ఛార్మీ కౌర్ పై ఈడీ ప‌దిగంట‌ల పాటు విచారించింది. ఛార్మీ వాట్స్పప్ చాట్, కాల్ డేటా మ‌రియు కెల్విన్ తో లావాదేవీల‌పై ఈడీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు తెలుస్తొంది. అయితే విచార‌ణ‌లో ఛార్మీ మాత్రం త‌నకు అస‌లు కెల్విన్ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని ఈడీకి స‌మాధానం ఇచ్చింది.

ఇదిలా ఉంగ‌డా నేడు విచార‌ణ‌కు టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ హాజ‌రుకానుంది. ఉద‌యం ప‌దిగంట‌ల‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్ విచార‌ణ‌కు హాజ‌రుకానుంది. ఇక ర‌కుల్ ప్రీత్ త‌న‌కు ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వ‌డం కుద‌ర‌ద‌ని మ‌రో రోజు విచారించేలా చూడాల‌ని ఈడీకి లేఖ రాసింది. కానీ ఈడీ మాత్రం ర‌కుల్ ప్రీత్ కు షాక్ ఇచ్చి ఈరోజే విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశించింది. ఇక ఈడీ ర‌కుల్ పై ఎలాంటి ప్ర‌శ్న‌లు కురిపిస్తుందో చూడాలి.