లోక్ సభ లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కాంట్రాక్ట్ పద్ధతిలో కన్సల్టెంట్ పోస్టుల్ని లోక్‌సభ సచివాలయం భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. వేర్వేరు విభాగాల్లో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, జూనియర్ కంటెంట్ రైటర్, జూనియర్ అసోసియేట్ సీనియర్ కంటెంట్ రైటర్ పోస్టులు వున్నాయి. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 11 చివరి తేదీ.

lok-sabha
lok-sabha

ఇవి ఒక ఏడాది కాంట్రాక్ట్‌తో భర్తీ చేస్తున్న పోస్టులు మాత్రమే గమనించండి. ఎంపిక అయిన వాళ్ళు లోక్‌సభ సచివాలయంలోని పీపీఆర్ వింగ్‌లో సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ యూనిట్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ గడువు రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ పద్దతిలోనే అప్లై చెయ్యాలి.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ కన్సల్టెంట్) 1 వుంది. ఈ పోస్ట్ కి అప్లై చెయ్యాలంటే ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. అలానే రెండేళ్ల అనుభవం ఉండాలి.

అలానే సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్ కన్సల్టెంట్) 1 పోస్ట్ వుంది. బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. ఏడాది అనుభవం ఉండాలి. అదే విధంగా సీనియర్ కంటెంట్ రైటర్ లేదా మీడియా అనలిస్ట్ (హిందీ) 1 ఖాళీ వుంది. పొలిటికల్ సైన్స్, జర్నలిజం, లా, హిందీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.

జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ) 1 ఖాళి వుంది. బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. ఏడాది అనుభవం ఉండాలి. అలానే జూనియర్ కంటెంట్ రైటర్ (ఇంగ్లీష్) ఒక ఖాళి వుంది. బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. ఏడాది అనుభవం ఉండాలి. అలానే సోషల్ మీడియా మార్కెటింగ్ (అసోసియేట్) 5 పోస్టులు వున్నాయి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. అలానే మేనేజర్ (ఈవెంట్స్) 1 పోస్ట్ వుంది హోటల్ మేనేజ్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా పాస్ కావాలి. లేదా మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా డిగ్రీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 22 నుంచి 58 ఏళ్లు ఉండాలి. పూర్తి వివరాలని నోటిఫికేషన్ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ లింక్:

http://loksabhadocs.nic.in/JRCell/Module/Notice/Advertisement_of_Consultants21092021.pdf

Read more RELATED
Recommended to you

Latest news