తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె కాలంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందు కోసం టెంపరరీగా డ్రైవర్, కండక్టర్, సూపర్ వైజర్ వంటి పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. తాత్కాలిక ప్రతిపాదికన డ్రైవర్లు మరియు కండక్టర్లుగా పని చేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల కోసం ప్రకటనలు వేశారు.
రీజియన్ల వారీగా ఈ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ఉద్యోగాల్లో చేరానుకునేవారు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని రీజినల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాల్లో సంప్రదించాలి. ఇంతకీ అర్హతలు ఏమిటంటారా.. కండక్టర్ గా పనిచేయుటకు పదో తరగతి చదివితే చాలు.. ఆధార్ కార్డు, ఒరిజినల్ పదో తరగతి మార్కుల పత్రము తెచ్చుకోవాలి. అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వారు, వారి మార్కుల ధృవ పత్రము తీసుకురావాలి.
డ్రైవర్ గా పనిచేయుటకు ఆధార్ కార్డు మరియు 18 నెలలు, అంతకంటే ఎక్కువ హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉన్న వారు ఒరిజినల్ లైసెన్స్ తో హాజరు కావాలి. వీరికి రోజువారీగా డ్రైవర్ లకు 1500.00 రూ. లు.. కండక్టర్ లకు 1000.00 రూ. లు చెల్లిస్తారు. రిటైర్డ్ అయిన ఆర్టీసీ అభ్యర్థులు సమ్మె కాలంలో పని చేయడానికి ఆసక్తి గలవారు తమ పరిధిలో గల డిపో మేనేజర్ లను లేక రీజినల్ మేనేజర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
రిటైర్డ్ సూపర్ వైజర్ లకు 1500 రూపాలు, రిటైర్డ్ మెకానిక్ లకు : 1000 రూ. లు, రిటైర్డ్ క్లర్క్ లకు 1000 రూ. లు చెల్లిస్తామని అధికారులు ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఉద్యోగాలకు వెళ్లేవారు సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.