బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: గోపీచంద్, మెహ్రీన్ ఫిర్జాదా,
సినిమాటోగ్రఫీ: వెట్రీ
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
నిర్మాత: రామ బ్రహ్మం సుంకర
దర్శకత్వం: తిరు
రన్ టైం: 147 నిమిషాలు
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రిలీజ్ డేట్: 05 అక్టోబర్, 2019
టాలీవుడ్ హీరో గోపిచంద్.. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. కథల ఎంపికలో ఎంతో కొత్తదనం కనబరస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. సాహసం లాంటి సినిమాతోనే తానెంత ప్రత్యేకమో గోపిచంద్ తెలుగు ప్రేక్షకులకు చెప్పారు. ఈ క్రమంలోనే మరో విభిన్న కథాంశంతో రూపొందించిన చాణక్య సినిమాలో ఆయన నటించారు. ఈ చిత్రానికి తమిళంలో మంచి గుర్తింపు పొందిన తిరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే.. ఇందులో గోపించ్‌కు జంటగా మెహ్రీన్ నటించింది. ఈ నేపథ్యంలో చాణక్య సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథేమిటంటే…
ఇక కథ విషయానికి వద్దాం.. అర్జున్(గోపిచంద్) ఓ అండర్ కవర్ ఏజెంట్. భారతదేశానికి చెందిన రీసెర్చ్ అండ్ వింగ్ ఉడెర్ కవర్ ఏజెంట్‌గా ఉంటాడు. అయితే ఒక మిషన్ నిమిత్తం గోపిచంద్ బ్యాంకు ఉద్యోగిగా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన పెద్ద టెర్రరిస్ట్ ఖురేషిని టార్గెట్ చేస్తాడు. ఆయనకు సంబంధించిన కొంతమంది స్లీపర్ సెల్స్ ను గోపిచంద్ హతమారుస్తాడు. ఇలా ఖురేషీని గోపిచంద్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎలాంటి మలుపులు వచ్చాయి..? అసలు ఆయన చేపట్టిన మిషన్ ఏమిటి? ఇదంతా ఎలా కొనసాగింది. ఇక హీరోయిన్ మెహ్రీన్, గోపిచంద్ మధ్య కెమెస్ట్రీ ఎలా ఉంది..? తదితర ఇంట్రెస్టింగ్ అంశాలను తెలువాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే మరి.
విశ్లేషణ :
ఈ సినిమాలో హీరో గోపిచంద్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఆయన నటనే సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. హీరోయిన్ మెహ్రీన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ప్రధానంగా వీరి మధ్య కెమెస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే.. తమిళంలో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు తిరు టాలీవుడ్‌లో మాత్రం మొదటి సినిమాతోనే కొంత తడబడినట్టు అనిపిస్తుంది. మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను కాస్త పరమ రొటీన్ మాస్ మసాలా సినిమాగా మార్చేశాడు. చాలా సీన్లను గతంలో చూసిన సీన్ల తరహాలోనే చిత్రకరించేశాడు.
క్లైమాక్స్‌కు ముందే పెద్ద ఛేజింగ్ సీన్ పెట్టి.. ప్రేక్షకుడిని క్లైమాక్స్ మూడ్‌లోకి తీసుకు వెళ్లాక కూడా గోపీ – మెహ్రీన్ మధ్య డ్యూయట్ సాంగ్ రావడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష. ఇక టెక్నికల్‌గా చూస్తే ఇక వెట్రి పళనిస్వామి అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్ అని చెప్పొచ్చు. విశాల్ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. అలాగే శ్రీచరణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనానికి తగ్గట్టుగా ఉంది. మొత్తంగా హీరో గోపిచంద్ మరో విభిన్న కథాంశంతో కొంత వరకు సక్సెస్ అయినా చాలా రోజుల నుంచి గోపీచంద్ కోరుకున్న స్థాయి సినియా అయితే చాణక్య కాదు.
ఎప్పుడూ విభిన్న కథాంశాలతో ముందుకు వచ్చే హీరో గోపిచంద్. తిరు దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా చాణక్య కూడా ఇదే కోవలోకి వస్తుంది. మొదటి భాగం కాస్త నెమ్మదిగా సాగినా.. రెండో భాగం మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. ప్రధానంగా పలు యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కథాను సారంగా వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇక గోపిచంద్, మెహ్రీన్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక బాలీవుడ్ బ్యూటీ జరీన్ చేసిన ప్రత్యేక గీతం కూడా సినిమాకు అదనపు బలంగా ఉంటుంది. అయితే.. దర్శకుడు తిరు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. సినిమా మరింత ఇంట్రెస్టింగ్ ఉండేదని చెప్పొచ్చు. కథను నడిపించడంలో దర్శకుడు కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది.
ఫైనల్‌గా…
స్పై యాక్షన్ థ్రిల్లర్ కాదు రొటీన్ యాక్షనే
చాణక్య రేటింగ్: 2.5 / 5