అమెరికాకి 46వ అధ్యక్ష్యుడిగా ఎన్నికయిన జో బిడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్ళగా తనకు నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తికి కీలక పదవి అప్పగించారు. బుధవారం నాడు డెమొక్రాటిక్ ఆపరేటివ్ అయిన రాన్ క్లైన్‌ను తన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, వైట్‌హౌస్‌కు తన తరపున మొదటి సిబ్బందిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. “మేము ఇద్దరం కలిసి పనిచేసిన చాలా సంవత్సరాలు నాకు చాలా అమూల్యమైనవి అని బిడెన్ క్లెయిన్ ని చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ప్రకటిస్తూ పేర్కొన్నారు.
బిడెన్ 2009 లో ఉపాధ్యక్షుడైనప్పుడు డెమొక్రాట్ యొక్క మొదటి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా క్లెయిన్ పనిచేశాడు. దేశం ఎదుర్కొంటున్న అత్యవసర సవాళ్లను ఎదుర్కోవడానికి అనుభవజ్ఞులైన అలానే ప్రతిభావంతులైన టీమ్ ని తన ప్రమాణ స్వీకారానికి ముందే రెడీ చేస్తున్నారని అమెరికా మీడియా చెబుతోంది. 59 ఏళ్ల క్లైన్, బిడెన్ సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా పనిచేశాడు. తరువాత కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ అల్ గోర్ కి కూడా చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేశాడు.