హైదరాబాదులో మహిళలకు 3000 కోట్ల వడ్డీ లేని రుణాలు : డిప్యూటీ సీఎం భట్టి

-

బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేసారు. బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన అవసరం లేదు.. హైడ్రా అనుమతులు ఇవ్వదు. స్వయం సహాయక సంఘాల రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉంది… వారికి పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వండి. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలి.. మాది ప్రజా ప్రభుత్వం ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నాం. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలి.. మాది ప్రజా ప్రభుత్వం ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నాం. బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.

ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బ్యాంకింగ్ రంగం ద్వారా చేయూతను అందించాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాం. కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలనేదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశం. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు వెళ్తాయి. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలి. రుణాలు ఇచ్చే ముందు ఉన్న నిబంధనలు సరళ తరం చేయాలి. ప్రైవేటు విభాగాల్లో బ్యాంకర్లు ఇచ్చిన రుణాల రికవరీ శాతం తక్కువగా ఉంటుంది. అదే స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన రుణాల రికవరీ శాతం చూస్తే 98 శాతానికి పైగా ఉంది. హైదరాబాదులో 3000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించాం. వాటిని ఐదు వేల కోట్లకు తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version