పవన్ కళ్యాణ్ పల్నాడు పర్యటన వలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. డిప్యూటీ సీఎం వస్తున్నందున పల్నాడు సమస్యలు పరిష్కరిస్తారని జనం భావించారు. కానీ సరస్వతీ భూములపై రాజకీయం చేయటం దారుణం అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. జగన్ కుటుంబం సొంత డబ్బులతో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు కొన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటైతే వెనుకపాటు పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి జరగేది. కానీ జగన్ ఆస్తులపై కేసులు వేసి ఆపేయించారు. మైనింగ్ లీజును సైతం రద్దు చేస్తే హైకోర్టు కు వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నారు. ఆ భూముల్లో అటవీభూమి ఉందంటూ రచ్చ చేస్తున్నారు.
కానీ అలాంటిదేమీ లేదని మీ అధికారులే చెప్తున్నారు. 15 సంవత్సరాల క్రితమే ఆ భూములను జగన్ రైతుల నుండి కొన్నారు. అనకాపల్లి వద్ద స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చంద్రబాబు చెప్తుంటే ఒరిస్సా ప్రభుత్వం మాత్రం దాన్ని కొట్టివేస్తోంది . కోడెల శివప్రసాదరావు మృతికి కారణమేంటో ప్రజలు అందరకీ తెలుసు. దానిని కూడా రాజకీయం చేయాలనుకోవటం సరికాదు. చనిపోయిన వారి గురించి మాట్లాడటం సబబుకాదు. హోంమంత్రి సరిగా పనిచేయటం లేదని అంటున్నారు. అంటే ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదని పవన్ అంగీకరించారు అని మహేష్ రెడ్డి అన్నారు.