నేడు అమెరికా అధ్యక్షుడిగా జొ బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటే ఉపాధ్యక్షురాలిగా కమల హ్యారిస్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు జొ బైడెన్ బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. ఇక ఉపాధ్యక్ష పదవి చేపడుతున్న తొలి నల్లజాతీయురాలిగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు. క్యాపిటల్ భవనం బయట బయట జొ బైడెన్ అలాగే కమల హరీష్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనం ముట్టడి తర్వాత జరుగుతున్న ఈ ప్రమాణస్వీకారోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి భద్రత కోసం వాషింగ్టన్లో ఇరవై వేల మంది నేషనల్ గార్డులను మోహరించారు. ట్రంప్ మద్దతు దారులు మరో సారి బీభత్సం సృష్టిస్తారోననే అనుమానంతో అన్ని వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. రాళ్లు రువ్వడం దగ్గరి నుంచి బాంబులు పేల్చడం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలైనా చోటుచేసుకోవచ్చని నిఘా సంస్థల హెచ్చరికలతో భద్రతా విభాగాలన్నీ అప్రమత్తం అయ్యాయి.