పవన్ కల్యాణ్‌ రాజకీయ వ్యభిచారి – మంత్రి జోగి రమేష్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రాజకీయ వ్యభిచారి అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌. బీజేపీ పంచన ఉంటూ చంద్రబాబుకు సిగ్నల్ ఇచ్చేవాడిని ఇంకేం అంటారు? అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల పొత్తుల వలన మాకు వచ్చే ఇబ్బందిఏమీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు జోగి రమేష్‌.

అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి వలన అందుతున్నా యో ప్రజల కు బాగా తెలుసు. అందుకే ఎన్నికల్లో చంద్రబాబు కూటమికి తగిన బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు జోగి రమేష్‌. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఇవాళ కలిసేదేముందీ?మొదటనుంచి వారి మధ్య అక్రమ పొత్తులు కొనసాగుతున్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్‌ అన్నట్టుగానే రాష్ట్రంలో అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం వైఎస్సార్‌సీపీ 151పైగా సీట్లలో గెలవటమే. అంతే తప్ప పవన్ కల్యాణ్‌ ఊహించుకునేదేమీ జరగదని విమర్శించారు జోగి రమేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news