పవన్ గెలుపుపై జోగి బెంగ..!

-

పవన్ కల్యాణ్ టార్గెట్‌గా వైసీపీ నేతలు విరుచుకుపడటం ఆగలేదు. పవన్ కొన్ని సమస్యలపై స్పందిస్తూ…వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయనగరం జిల్లాకు వెళ్ళి అక్కడ జగనన్న కాలనీలని పరిశీలించారు. ఇక కాలనీల పేరిట ..ఇళ్ల స్థలాలకు భూములు సేకరణలో వేల కోట్లు కొట్టేశారని, చదును చేయడానికి, మట్టి వేయడానికి, ఇక నిర్మాణల్లోనూ అక్రమాలు జరిగాయని పవన్ ఫైర్ అయ్యారు. దాదాపు 15  వేల కోట్లని కొట్టేశారని అన్నారు.

ఇలా విమర్శలు చేసి పవన్ హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు..అయినా సరే వైసీపీ మంత్రులు పవన్‌పై ఫైర్ అవుతూనే ఉన్నారు. జగనన్న కాలనీల నిర్మాణం అద్భుతంగా జరుగుతుందని, దేశంలోనే ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదని, కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుందని,  పవన్, ఆయన దత్తతండ్రి కలిసొచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. రాక్షసులు, దుర్మార్గులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని, అసలు ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారో చూసుకో… నువ్వు ఎక్కడెక్కడ పోటీ చేయాలో అది చూసుకో… గెలుస్తావో లేదో అది కూడా చూసుకో  అని పవన్‌పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. అంటే పవన్ మళ్ళీ గెలవలేరని ఎగతాళి చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు పవన్‌ గెలవలేరని మాట్లాడుతున్న మంత్రులు..ఆయన్నే ఎక్కువ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అసలు ప్రజా బలం ఉంటే…ఎవరెన్ని అంటే ఏముంది..ఎవరు కలిసి పోటీ చేస్తే ఏముంది.

కానీ చంద్రబాబు-పవన్ పోటీ చేస్తే రిస్క్ ఉంటుందనే భయం వైసీపీలో ఉందని చెప్పొచ్చు. అందుకే పదే పదే పవన్‌ని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిసారి ఆయన రెండుచోట్ల ఓడిపోయారని, ఈ సారి కూడా ఓడిపోతారని అంటున్నారు. అయితే పవన్ గెలుపు ఈ సారి ఏ రేంజ్‌లో ఉంటుందో వైసీపీకి బాగా తెలుస్తుందని..ఇలా పవన్ గెలుపు గురించి మాట్లాడుతున్న మంత్రి జోగి..పెడనలో గెలవాలని జనసేన శ్రేణులు సవాల్ చేస్తున్నాయి. వాస్తవానికి టీడీపీ-జనసేన గాని కలిస్తే పెడనలో జోగికి ఇబ్బందే. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వాళ్లే జోగికి గెలుపు దక్కింది. మరి ఈ సారి ఏం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version