చంద్రబాబుకు పైత్యం బాగా ముదిరింది : జోగి రమేష్

-

నేడు కుప్పంలో పర్యటించడానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబుకు పైత్యం బాగా ముదిరిందన్నారు. 11 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుకు కనీస మానవత్వ విలువలు కూడా లేవని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఈ రోజు మళ్ళీ కుప్పం వెళ్లి రంకెలేశాడు. కార్యకర్తలను ఉసిగొల్పుతున్నాడు. కుప్పంలో బహిరంగ సభ పెట్టుకుంటామని పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారా?.. టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతుంటే పోలీసులు ఆపారా?.. మరి చంద్రబాబు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు?.. 11 మందిని బలితీసుకున్న వ్యక్తి చంద్రబాబు. ప్రభుత్వం ఇచ్చిన జీవో అసలు చదివావా చంద్రబాబూ?. అందులో ఏముందో సరిగ్గా చూడు. పాత చట్టం ప్రకారమే ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ జీవోపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మీటింగ్ పెట్టుకోవాలంటే పర్మిషన్ అడగాలి కదా?.

అడగకపోగా నన్ను ఆపేది ఎవరు? కుప్పం నాది అని రెచ్చగొడుతున్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటు లేదు, ఇల్లు‌ లేదు, అడ్రస్ లేదు. చెప్పుకోవటానికి చంద్రబాబుకు కుప్పంలో ఏమీ లేదు. ఇది చెప్పకుండా పోలీసులను తిడతాడు, సీఎం మీద నోరు పారేసుకున్నారు, కుప్పం ప్రజలు చంద్రబాబును అప్పడం చేశారు. స్థానిక ఎన్నికలలో ఏదీ గెలవలేక పోయిన వ్యక్తి చంద్రబాబు. అంత ఘోరంగా కుప్పం ప్రజలు ఎందుకు ఓడించారో గుర్తించావా?. 14 సంవత్సరాలు‌ పనిచేసిన అసమర్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఖాళీ ప్లేసులో మీటింగ్ పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు?. ఇరుకు రోడ్ల మీద పెట్టి డ్రోన్ షూటింగ్ లతో పబ్లిసిటీ చేయాలని చూస్తే కుదరదు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు పెట్టాలని చూస్తే సహించం. గ్రౌండ్ లో పెడితే జనం రారని చంద్రబాబుకు భయం. చంద్రబాబు చావ చచ్చిపోయాడు.‌ టీడీపీ కుప్పకూలింది. పుత్రుడు, దత్తపుత్రుడు వచ్చినా నిన్ను రాజకీయంగా బతికించలేరు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version