రేవంత్‌ రెడ్డికి జోగు రామన్న సవాల్‌

-

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న రేవంత్.. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే తాను ఉరేసుకుంటున్నానని చెప్పారు. దమ్ముంటే తన సవాల్ను రేవంత్ స్వీకరించాలన్నారు. ఆదిలాబాద్లోని క్యాంపు కార్యాలయంలో జోగు రామన్న మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై తరచూ రేవంత్ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని. ఆయన తీరు మార్చుకోవాలని హితువు పలికారు.

గతంలో చంద్రబాబును.. ఇప్పుడు రాహుల్ గాంధీని జోకిన చరిత్ర నీదని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనను రేవంత్ రెడ్డి అవమానించాడని.. బలహీన వర్గాలకు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా జోగు రామన్న డిమాండ్ చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్‌ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ఉరి వేసుకుంటానని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటావా అని జోగు రామన్న సవాల్ విసిరారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version