కొన్నాళ్ళ క్రితం రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ మీడియా గురించి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేసారు. మీడియాకు బ్రేకింగ్ ఫోబియా పట్టుకుంది అని. ఆయన ఆ మాట ఊరికే అనలేదు. చాలా ఘటనలు దానికి ప్రూఫ్ లు గా మనం చూపించవచ్చు. మనిషి ప్రాణాల కంటే కూడా తన విధి నిర్వహణ ముఖ్యం అని భావిస్తూ ఉంటాడు జర్నలిస్ట్. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో ఎన్నో చూస్తూ ఉంటాం.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎక్కడో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి బండి మీద నుంచి కింద పడి నా ప్రాణాలు కాపాడండి అని అరుస్తుంటే చాలా మంది నడుస్తూ వెళ్తున్నారు, వాహనాల మీద వెళ్తున్నారు. అతన్ని చూసి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధి చనిపోతున్న వ్యక్తి ముఖం మీద కెమెరా పెట్టి వీడియో రికార్డ్ చేసాడు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
కాపాడండి అని అరుస్తున్న అక్కడున్న ఎవ్వరికి వినబడలేదు. ప్రాణం నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. హాయిగా న్యూస్ దొరికిందని…
Posted by Lakshmi Narayana on Thursday, 6 August 2020