ఆన్లైన్ బిచ్చగాడు.. నెల సంపాదన ఎంతో తెలుసా…!

-

సహజంగా ఎవరైనా అడుక్కోవాలి అనుకుంటే వీధి వీధి తిరుగుతూ, లేదంటే సింపతీ కోసం చక్రాల బండి కట్టుకుని, దీనంగా ముఖం పెడుతూ భారత దేశంలో ఉన్న దరిద్రం మొత్తం వాడి జేబూలోనే ఉన్నట్టుగా కలరింగ్ ఇస్తాడు. ఇంకొంత మంది అడుక్కునే విధానం వేరుగా ఉంటుంది. కానీ అమెరికాలో ఓ బిచ్చగాడు అడుక్కునే విధానం చూస్తే మాత్రం షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే.

Jovan Hill Online Beggar’ Makes $4,000 A Month
Jovan Hill Online Beggar’ Makes $4,000 A Month

అంతగా షాక్ అవ్వడానికి ఏమిటా స్పెషల్ అనుకుంటున్నారా. అసలు విషయం తెలుసుకుంటే తప్పకుండా షాక్ అవుతారు. రెండు చేతులూ, కాళ్ళు బాగానే ఉండి కూడా ఎవరైనా అడుక్కుంటే మనకి మాంటెక్కుతుంది. అలాంటిది అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన ఓ యువకుడు చాలా బలిష్టంగా ఉంటాడు. ఎంతో హుందాగా కనిపించే అతడు అడిగీ అడగగానే అమెరికా ప్రజలు వందల డాలర్లు గుమ్మరిస్తున్నారట. అయితే అడుక్కోగా వచ్చిన డబ్బుతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడట.

ఆ బిచ్చగాడి పేరు జొవాన్ హిల్. అమెరికాలో అనేకరకాల ఉద్యోగాలు చేసి విసుగు చెందాడు. దాంతో ఉద్యోగం మానేశాడు. ఈ క్రమంలోనే ఆర్ధిక ఇబ్బందులు అతడిని చుట్టుముట్టాయి. ఏమి చేయాలో తెలియక తన బాధలు సోషల్ మీడియాలో పంచుకుంటూ తనకి డబ్బులు ఇవ్వాల్సిందిగా తన ఖాతా నెంబర్ పెట్టి డబ్బులు అడుక్కున్నాడు. దాంతో స్పందించిన ప్రజలు వందల డాలర్లు ఆర్ధిక సాయం చేశారు. దాంతో మనోడు ఆన్లైన్ బిచ్చగాడిగా ఫుల్ ఫేమస్ అయిపోయాడు.

తనకి డొనేషన్లు చేసేవారికోసం మనోడు కామెడీ పాటలు, చిన్న చిన్న వీడియోలు పోస్ట్ చేసి వారిని సంతోష పెడుతూ ఉంటాడు. ఇంతకీ అతడికి నెల వారీగా డొనేషన్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నెలకి అతడి బిక్షాటనలో నెల సంపాదన ఎంతో తెలుసా అక్షరాలా లక్ష రూపాయలు. నోళ్ళు వెళ్ళబెడుతున్నారా అవును, ఇతడిని ఆన్లైన్ లో ఫాలో అవుతున్న వాళ్ళు వీడి పనే బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news