ఏపీకి డబుల్‌ ఇంజన్‌ కావాలి : జేపీ నడ్డా

-

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు రాజమండ్రిలో పర్యటించిన జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. కేంద్రం నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు జేపీ నడ్డా. ఏపీకి రూ. 8 లక్షల కోట్ల అప్పు ఉందని.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదని జేపీ నడ్డా విమర్శించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ గోదావరి గర్జన సభలో పాల్గొన్న నడ్డా.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కొన్నివర్గాలకే మేలు చేస్తున్నారని ఆరోపించారు.

జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిందని.. రాష్ట్రంలో ల్యాండ్, లిక్కర్, శాండ్ మాఫియా రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోవడం బాధ కలిగిస్తోందని, రాష్ట్రానాకి పెట్టుబడులు రావడం లేదని ఆయన విమర్శించారు. ఏపీలో మాతృభాష తెలుగుకి అన్యాయం జరుగుతోందన్నారు. ఏపీలో డబుల ఇంజన్‌ అభివృద్ధి కావాలని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version