వైద్యారోగ్య శాఖ మంత్రిగా హరీష్‌రావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పేదవారికి మెరుగైన వైద్యం అందించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలు దొరికినప్పుడల్లా.. ప్రభుత్వం ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేయడమే కాకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో నార్మల్ డెలివరీలు చేయిస్తే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3వేల పారితోషికం అందిస్తామని ఆయన ప్రకటించారు.
ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దామన్న హరీష్ రావు.. పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దని హితవు పలికారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు పెరగాలని, నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరగాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి తేడా ఏమిటో తెలియజేయాలన్నారు. ప్రైవేటు దవాఖానకు పోతే ఖర్చులు గురించి అవగాహన కల్పించాలన్నారు.