హెల్త్, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా

-

ప్రధాని మోడీ 3.0 కేబినెట్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ నెల 9 ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ రోజు నడ్డా హెల్త్, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

 

2019లో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ మొదటి టర్మ్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2020 జనవరిలో కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా నియామకం తర్వాత జేపీ నడ్డ పూర్తి స్థాయి పార్టీ అధ్యక్షుడయ్యారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన 63 సంవత్సరాల నడ్డా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అతను 1991 సంవత్సరములో భారతీయ జనతా యువమోర్చా , బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడయ్యాడు. బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహించి, పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి జేపీ నడ్డా నేతృత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news