BREAKING: ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝి

-

ఒడిశా ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్ చరణ్ మాఝిని బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. అధిష్ఠానం నిర్ణయంతో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయనను శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. రేపు ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. డిప్యూటీ సీఎంలుగా కనకవర్ధన్ సింగ్, ప్రవతి పరిదాను హైకమాండ్ ఎంపిక చేసింది.

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ విజయదుందుభి మోగించింది. రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన బిజూ జనతాదళ్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 ,బిజు జనతా దళ్‌ 51, కాంగ్రెస్‌ 14, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. సీఎం అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news