మా అసోసియేషన్ ఎన్నికలు పూర్తయినప్పటికీ… ఆ ఎన్నికల ఫలితాలపై తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. మా ఎన్నికల ఫలితాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ప్యానెల్ సభ్యులు. రిగ్గింగ్ కు పాల్పడింది అంటూ మంచు విష్ణు ఛానల్ పై ఆరోపణలు చేస్తున్నారు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు.
అంతే కాదు మా ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటున్న ప్రకాష్ రాజ్.. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో ఉన్నాయన్నాయని ఎన్నికల అధికారికి లేఖ కూడా రాశారు. తమకు సీసీ ఫుటేజ్ అందజేయాలని ఎన్నికల అధికారిని ప్రకాష్ రాజ్ కోరగా… అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్.
ఇది ఇలా ఉండగా “మా” ఎన్నికల వివాదంలో కొత్త కోణం చోటు చేసుకుంది. వివాదంగా మారిన మా ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ ను జూబ్లిహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఆయన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు పోలీసులు