ఫ్యాక్ట్ చెక్: నిరుద్యోగులకు కేంద్రం నెలకి రూ.3,500 ఇస్తోందా…?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుండి కూడా ఇలాంటి ఫేక్ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ఇక దాని కోసం చూస్తే… కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకి 3500 రూపాయలని ప్రతి నెలా ప్రధాన మంత్రి బేరోజ్ గర్ భట్ట యోజన కింద ఇస్తోందని తెలుస్తోంది.

 

18 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్యలో ఉండే యువత ఈ డబ్బులు తీసుకోవడానికి అర్హులు అని కూడా ఆ మెసేజ్ లో ఉంది. అదే విధంగా ఈ డబ్బుల్ని పొందాలంటే కచ్చితంగా పదో తరగతి పాస్ అయి ఉండాలి అని కూడా ఈ మెసేజ్ లో ఉంది. ఈ డబ్బులు పొందడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అక్టోబర్ 31, 2021 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరి తేదీ అని కూడా ఉంది.

రిజిస్ట్రేషన్ లింక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నిజంగా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకి నెలకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తోందా…? ఇందులో నిజమెంత అనేది చూస్తే… ప్రధాన మంత్రి బేరోజ్ గర్ భట్ట యోజన కింద కేంద్రం 3500 రూపాయలు ఇస్తోంది అన్న వార్తలో ఏ మాత్రం నిజం లేదు అని తెలుస్తోంది.

దీనిపై కేంద్రం కూడా శనివారం నాడు స్పందించింది. ఇది కేవలం ఫేక్ పోస్ట్ అని, ఇటువంటి స్కీమ్స్ లేవు అని క్లారిటీ ఇచ్చేసింది కేంద్రం. భారతదేశ ప్రభుత్వం ఇటువంటివి తీసుకురాలేదని ఇలాంటి లింక్స్ వస్తే వాటి మీద క్లిక్ చేయద్దని, మోసపోవద్దని చెప్పారు. కనుక ఇలాంటి ఫేక్ పోస్ట్లు వస్తే వాటిని నమ్మొద్దు మరియు ఫార్వర్డ్ చెయ్యొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news