బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కరోనా కలకలం..!

-

కరోనాని కట్టడి చేయడంలో ప్రముఖపాత్ర పోషిస్తున్న ఫ్రంట్ వారియర్స్ ను కూడా కరోనా వణికిస్తుంది. ఇప్పటికే ఎందరో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కోవిడ్ బారిన పడ్డారు. అయితే తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఏడుగురు పోలీసులు ఈ మహమ్మారి బారిన పడినట్టు తెలుస్తుంది. దీంతో తెలంగాణ పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఆ పోలీసులతో కాంటాక్ట్ ఉన్న వారిని క్వారంటైన్లో ఉంచి టెస్టులు చేస్తున్నారు. అలాగే గత వారం హైదరాబాద్‌ లోని ప్రభుత్వ హాస్పిటళ్లలో పని చేస్తున్న వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. గాంధీ, నిమ్స్‌‌కు చెందిన డాక్టర్లతోపాటు ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థులకు సైతం కరోనా సోకింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version