మల్లికార్జున్‌ ఖర్గేకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

-

ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే భద్రత విషయంలో హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ముప్పు అవగాహన నివేదికను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖర్గేకు భద్రత కల్పిస్తుందని తెలిపారు. జెడ్‌ ప్లస్ కేటగిరిలో ఆరుగురు గన్‌మెన్‌లు, ఇంటి వద్ద కాపలాలకు మరో ఇద్దరిని ( ప్లస్ 8) కేటాయిస్తారు. ఆయన దేశంలోఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా 50 మందికి పైగా కమాండోలు ఆయన వెంట ఉంటారు.జడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 24 గంటలూ భద్రత కల్పిస్తారు. కనీసం 36 మంది సెక్యూరిటీ షిప్టుల వారీగా కాపలా కాస్తారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నవారికి సీఐఎస్ఎఫ్‌లు,నేషనల్ సెక్యూరిటీ గార్డ్ భద్రత నిర్వహిస్తారు. కొన్నిసార్లు సీఆర్పీఎఫ్,ఐటీబీపీ సిబ్బంది కూడా ఎస్కార్ట్‌గా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news