దిల్లీ లిక్కర్ స్కామ్​లో.. మాగుంట రాఘవ్‌కు జ్యుడిషియల్‌ రిమాండ్‌

-

దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ, సీబీఐలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. వరుస అరెస్టులు చేస్తూ ఈకేసు విచారణలో దూసుకెళ్తున్నాయి. లిక్కర్ పాలసీలో ఇటీవల అరెస్టయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌కు దిల్లీ రౌస్‌అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.

దిల్లీ లిక్కర్ పాలసీలో నగదు అక్రమ చలామణీ వ్యతిరేక చట్టం (పీఎల్‌ఎంఏ) కింద మాగుంట రాఘవ్‌ను ఈడీ ఈ నెల పదో తేదీన అరెస్టు చేసింది. 11వ తేదీన కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం పది రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చిన విషయం విదితమే. కస్టడీ ముగియడంతో ప్రత్యేక న్యాయస్థానం ఎదుట మాగుంట రాఘవ్‌ను ఈడీ అధికారులు సోమవారం హాజరుపరిచారు.

ఆయనను జ్యుడిషియల్‌ కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాదులు కోరారు. దీనికి అంగీకరించిన ప్రత్యేక కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మార్చి నాలుగో తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version