ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.. శుభవార్తలు వింటారు..

-

జూలై 10 ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం: పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కీలక నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు. దైవదర్శనాలు చేస్తారు..

వృషభం: శుభవార్తలు వింటారు.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.సమాజంలో కొత్త వ్యక్తులతో పరిచయం..ఈరోజు అనుకున్న పనులు పూర్తీ అవుతాయి..

మిథునం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి..కొత్త రుణాలు లాభిస్తాయి.

కర్కాటకం: పనుల్లో తొందరపాటు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది.

సింహం:. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించదు.ఈరోజు కొత్త పనులు, శుభకార్యాలు చెయ్యడం వాయిదా వెయ్యడం మంచిది.

కన్య: కొత్త పనులు చేపడతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు.. సమాజంలో గౌరవం. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు..ఈరోజు ఆస్తిలాభం..

తుల: కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి..ఈరోజు అంత మంచి ఫలితాలు లేవు..

వృశ్చికం: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు..

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మకరం: సంఘంలో విశేష ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులను సకాలంలో పూర్తీ చేస్తారు.

కుంభం: కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు.

మీనం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవచింతన. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు..జాగ్రత్తగా ఉండాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version