బ్యాంక్ వినియోగదారులకు హెచ్చరిక..కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ జూన్ నెలలో 8 రోజులు బ్యాంక్ సెలవుల్ని ప్రకటించింది. అందుకే బ్యాంకుల్లో ముఖ్యమైన పనులుంటే ఈ 8 రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో పూర్తి చేసుకోవచ్చని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు..ఇక జూన్ నెలలో ఆర్బీఐ ఇచ్చిన బ్యాంక్ హాలిడేస్‌లో కొన్ని రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయని గుర్తుంచుకోవాలి.
జూన్ నెలలో బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడంటే..
జూన్ 2: మహరాణి జయంతి
జూన్ 5: ఆదివారం
జూన్11: రెండవ శనివారం
జూన్12: ఆదివారం
జూన్15: వైఎంఏడే
జూన్19: ఆదివారం
జూన్ 25: నాల్గవ శనివారం
జూన్26: ఆదివారం
ఈ నెలలో జూన్‌లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు వారాంతపు సెలవులు ఉన్నాయి. జూన్‌లో బ్యాంకులు మూసి ఉండేది 6 రోజులు మాత్రమే. దాదాపు దేశంలోని అన్ని రీజియన్లలో ఇవే సెలవులు ఉన్నాయి. జూన్ 2న షిమ్లా రీజియన్‌లో మహారాణ ప్రతాప్ జయంతి సందర్భంగా, జూన్ 15న ఐజ్వాల్, భువనేశ్వర్, జమ్మూ, శ్రీనగర్ రీజియన్‌లో వైఎంఏ డే, గురు హర్‌గోబింద్ పుట్టినరోజు, రాజ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉన్నాయి.
ఇక జూలైలో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు వీకెండ్ హాలిడేస్ వచ్చాయి. జూలైలో బ్యాంకులకు మొత్తం 7 సెలవులు వచ్చాయి. వరుసగా రెండు నెలలు బ్యాంకులకు ఎలాంటి పండుగ సెలవులు రాలేదు.మాములుగా లావాదేవీలను జరుపుకొవచ్చు..జూన్ నెలలో బ్యాంక్ ల సెలవులకు సంభందించిన పూర్తీ వివరాలను ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు..