వాళ్ళకు ఎప్పుడు న్యాయం చేస్తారు…?

-

ఇక్కడ మీడియాను విమర్శించడమో లేక కొన్ని వర్గాలను, ప్రజలను పోలీసులను తప్పుబట్టడం కాదు గాని… దేశంలో అన్యాయాలకు ప్రజలు ప్రాధాన్యతలను మారుస్తూ ఉంటారు. దారుణాన్ని దారుణంగా చూడకుండా… అది చిన్నదేలే… ఇది పెద్దది అంటూ మాట్లాడుతూ ఉంటారు. దిశ అత్యాచారం, హత్య కేసులో ఇదే జరిగింది. దిశ ను అత్యంత పాశవికంగా చంపారు. అందులో కాదు అనడానికి ఏం లేదు… కాని అదే రోజు… వరంగల్ లో మానస, మరో చోట టేకు లక్ష్మి అనే ఇద్దరినీ అదే విధంగా దారుణంగా అత్యా చారం చేసి హత్యలు చేసారు.

కాని దేశం మొత్తం జస్టీస్ ఫర్ దిశ అంటూ నినదించింది. ప్రపంచం దృష్టిని మన వైపుకి తిప్పేలా ప్రజలు నిరసనలు చేసారు. మరి జస్టీస్ ఫర్ టేకు లక్ష్మి, జస్టీస్ ఫర్ మానసా…? టేకు లక్ష్మిని వేళ్ళు నరికారు, కోశారు, ఒంటరిగా ఉన్న మహిళను నలుగురు కలిసి దారుణంగా అత్యాచారం చేసారు. అత్యంత పాశవికంగా ఆ హత్య జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు… అది కూడా తెలంగాణాలోనే కదా జరిగింది… దిశ ఒక్కరే ఆడపిల్లా…? మానసను నమ్మించి చంపేసాడు ఆమె స్నేహితుడు… దీనిపై దేశం ఎందుకు నినదించడం లేదు…?

పోలీసులు ఏం చేసారో ఎలా చేసారో… దిశకు న్యాయం జరిగింది… వాళ్లకు కూడా ఇలాగే న్యాయం చేయండి… దయచేసి నేరం తీవ్రతలను నిందితులు సాక్ష్యాలతో సహా దొరికాక కూడా వాయుదా వేస్తూ జైళ్ళల్లో పెట్టి వాళ్ళను మేపోద్దు… అవును ఇప్పుడు సమాజం ఇదే అడుగుతుంది. టేకు లక్ష్మిని చంపిన విధానం చూస్తే చాలా మందికి జీవితం అంటేనే భయమేస్తుంది… ఆ నలుగురిని కూడా ఇలాగే శిక్షించండి… ప్రభుత్వాలు తలుచుకుంటే ఏది అయినా సరే జరుగుతుంది… చట్టాలు, కోర్టులతో పని ఉండదు… ఆవును చట్టాలకు నేరం చేసిన వాడు భయపడనప్పుడు కోర్టుల గురించి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించాలి… తనకున్న వ్యవస్థతో టేకు లక్ష్మి, మానసకు కూడా న్యాయం చేయమనే డిమాండ్లు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news