విశాఖలో కే.ఏ.పాల్ దీక్ష భగ్నం.. సీఐ, ఎస్ఐ బచ్చాగాళ్లతో నాకేం పని..!

-

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేపట్టారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్. ఈ దీక్షను ఇవాళ పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు పాల్ దీక్షను భగ్నం చేసి.. అరెస్ట్ చేసి కేజీహెచ్ కి తరలించారు. ఇక ఆ సమయంలో పోలీసులతో కే.ఏ.పాల్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఓ సీఐ కాలర్ పట్టుకున్నాడు. వారితో చాలా దురుసుగా ప్రవర్తించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తనకు వైద్యం అవసరం లేదని కేకల్ వేశారు.

పోలీసులు కే.ఏ.పాల్ ను బలవంతంగా కేజీహెచ్ లో చేర్పించగా.. ఆయన పోలీసుల కళ్లు గప్పి కేజీహెచ్ నుంచి తప్పించుకొని తన వాహనంలో మళ్లీ నిరహార దీక్ష శిభిరానికి చేరుకున్నారు. అక్కడ తన వాహనంలో నిలబడి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలన్నింటిపై నిప్పులు చెరిగారు. తాను తప్ప ఇంకెవ్వరూ స్టీల్ ప్లాంట్ కోసం నిజాయితీగా పోరాడటం లేదని చెప్పుకొచ్చారు. “నా దీక్షనే భగ్నం చేస్తారా ? నన్నే అరెస్టు చేస్తారా ? ఎంత ధైర్యం ? నేను తిట్లు స్టార్ట్ చేశానంటే ఒక్కొక్కరూ గుండె ఆగి చస్తారు. సీఐ, ఎస్ఐ లాంటి బచ్చగాళ్లతో నాకేంటి డీజీపీతోనే చూసుకుంటాను. ఇక్కడ ఎవ్వరితో డీల్ చేస్తున్నారో మీకు తెలుస్తుందా ? కే.ఏ.పాల్ ఇక్కడ ” అని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news