భారీగా పెరిగిన బంగారం ధరలు..హైదరాబాద్‌ లో ఎంతంటే

-

 

బంగారం కొనుగోలు చేసే వారికి బిగ్‌ అలర్ఠ్. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇది ఇలా ఉండగా, బంగారం కొనుగోలు చేసే మహిళలకు బిగ్‌ అలర్ట్‌… దేశంలో బంగారం ధరలు పెరిగిపోయాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 59, 670 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి ధర రూ. 54, 470 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 80, 000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news