మందకృష్ణ మాదిగపై కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు

-

మందకృష్ణ మాదిగ దాదాపు 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మందకృష్ణ మాదిగ పోరాటం గురించి తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కి మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమేనని.. త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా మందకృష్ణ పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీలో చేరమంటే.. రూ.25కోట్లు అడిగారని కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టడానికి ముందు మందకృష్ణ మాదిగకు రూ.72 కోట్లు ముట్టాయని ఆరోపించారు. మోడీకి మందకృష్ణ అమ్ముడుపోయారని.. ప్రధాని మోడీని గతంలో ఇష్టం వచ్చినట్టు తిట్టి.. ఇప్పుడు దేవుడు అంటున్నారు. అన్న.. అన్న.. అని స్పీచ్ లో పొగిడాడని పేర్కొన్నారు. మోడీ బీసీ కాదని.. తన శిష్యుడు అని తెలిపారు కే.ఏ.పాల్. మూడు పార్టీలకు ప్రజలు ఓటు వేయకూడదని.. ఇంట్లోనే కూర్చోవాలని సూచించారు కే.ఏ.పాల్. ప్రజాశాంతి పార్టీకి సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హై కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు కే.ఏ.పాల్.

Read more RELATED
Recommended to you

Latest news