నేను టీడీపీ కూతురిని, కాంగ్రెస్ పార్టీకి కోడలిని : రేవంత్ రెడ్డి

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా తాను చంద్రబాబు నాయుడికి సహచరుడిని. సహచరుడిగా నిబద్ధతతో పని చేశాను. చంద్రబాబు నాయుడు గారు తనను గుర్తించారు. గౌరవించారు. అవకాశం ఇచ్చారు. ఇదంతా ఒక ఎపిసోడ్. నేను టీడీపీ నుంచి బయటికీ వచ్చిన తరువాత నేను ఇంకొక దగ్గర కూతురు ఇంట్లో ఉన్నంత కాలం.. తల్లిదండ్రుల పక్షానే ఉంటది.

కూతురు అత్తగారింటికి వెళ్లితే.. ఆ గడప ఇంటి గౌరవాన్ని కాపాడమే కోడలుకి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నేను కోడలు పాత్రను పోషించాల్సిందేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అంతే తప్ప పుట్టింటి గొప్పలు అన్ని ఊరుమీద ఉన్నోళ్లందరికీ చెప్పకూడదు. ప్రేమ వేరు.. గొప్పలు వేరు. తాను ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదని చెప్పానా ? పోనీ ఎవరికైనా చెప్పానా.. పోని ఎవరైనా నమ్ముతారా..? అని యాంకర్ ని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news