మెగాబ్రదర్స్ పై కేఏ పాల్ ఫైర్… ఫలితం పాజిటివ్!

-

మనిషి దేశంలో రాష్ట్రంలో లేడు.. దేశంలో లేడు.. దేశంలో జరిగే విషయాలపై స్పందించడు అనుకున్నారా… ప్రపంచంలో ఎక్కడున్నా నా కామెంట్స్ ఆగవు అన్నస్థాయిలో రెచ్చిపోయారు కేఏ పాల్! ఎవరూ ఊహించని స్థాయిలో చిరంజీవి.. పవన్ కల్యాణ్.. నాగబాబులపై ఫైరయ్యారు! ఈ క్రమంలో చిరంజీవి.. పవన్ లపై రాజకీయ కామెంట్లు చేసిన ఆయన… నాథురాం గాడ్సేపై నాగబాబు చేసిన కామెంట్స్ పై మాత్రం నిప్పులు చెరిగారనే చెప్పాలి! ఒకపక్క బైబిల్ ఉన్న మాటలు ప్రస్థావిస్తూ… నరహంతకులకు శాంతి ఉండదని నాగబాబు కామెంట్లపై ఫైరయ్యారు!!

గాంధీని చంపిన ఒక నీచుడు, దుష్టుడు, అసహ్యుడిని కొందరు పొగుడుతున్నారు… కొంతమంది ప్రశంసిస్తున్నారు! అది న్యూయార్క్ టైంస్ లో స్టోరీ వస్తే.. దేశ ప్రధాని మోడీకి తాను వ్యతిరేకంగా మాట్లాడటం, స్పందించడం కరెక్ట్ కాదని తాను స్పందించలేదని చెప్పుకొచ్చారు పాల్! అనంతరం నాగబాబు చేసిన ట్వీట్లపై స్పందించిన పాల్… “తెలివైనవాడు అనాలో తెలియదు, తెలివి తక్కువవాడు అనాలో తెలియదు.. ఆయన ఒక ట్వీట్ చేశాడు…. ఈ రోజు గాడ్సే పుట్టిన రోజు, నిజమైన దేశభక్తుడు, గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబెటబుల్.. అంటే గాంధీని చంపడం కరెక్టే అంటున్నాడు.. గాడ్సే ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాడు… నరహంతకులకు శాంతి ఉండదయ్యా నాగబాబు” అంటూ ఫైరయ్యారు పాల్!

సొంత ఊరిలో పోటీ చేసినా చిరంజీవి గెలవలేకపోయారని, జనం చిత్తుచిత్తుగా ఓడించారని.. తర్వాత పార్టీని అమ్మేయడం ద్వారా మంత్రి పదవి సంపాదించుకున్నారని ఫైరయిన కేఏ పాల్… పవన్ గడిచిన ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా కూడా ఓడిపోయాడని.. నాగబాబు ఎంపీగా సొంత ప్రాంతంలో పరాజయం చవిచూశారాని విమర్శించారు. గాంధీపై స్పందిస్తే దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం చూస్తాదని, ఆ విషయాన్ని మరిచిపోకూడదని గుర్తుచేసిన పాల్… రాజకీయ లబ్ధికోసమే నాగబాబు ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు పాల్! ఏది ఏమైనా… ఈ స్పీచ్ కి సంబందించిన వీడియోలకు ఎన్నడూ లేనంతగా పాల్ కి పాజిటివ్ కామెంట్స్ రావడం, బాగా స్పందించారని అభినందనలు రావడం కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version