బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలను అరెస్ట్ చేయాలి డిమాండ్ చేశారు కేఏ పాల్. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా.. ప్రకాశ్ రాజ్ లాగా తప్పు చేశా అని క్షమాపణలు అడిగి, వాటి మీద ఎంత సంపాదించారో అంత పంచండి అని మండిపడ్డారు కేఏ పాల్.
కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు చేసిన రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసాడు. ఫన్88 బెట్టింగ్ యాప్ కోసం ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఫిర్యాదుదారుడు. ఈ తరుణంలోనే బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలను అరెస్ట్ చేయాలి డిమాండ్ చేశారు కేఏ పాల్.