బలవంతంగా ఏ భాషను రుద్దే ప్రయత్నాన్ని నేను వ్యతిరేకిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దక్షిణాది సీట్లు తగ్గకూడదు, నేను అదే కోరుకుంటానని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి సభ్యుడిగా చెబుతున్నా దక్షిణాదికి సీట్లైతే కచ్చితంగా తగ్గవు అం చెప్పారు.. నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ప్రకటన రానప్పుడు ముందస్తు నినాదాలు విభజనకు దారితీస్తాయని పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన జరగనపుడు ముందే రాద్ధాంతం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.. నేను ఎప్పుడూ మాట మార్చలేదన్నారు. బలవంతంగా ఏ భాషను రుద్దే ప్రయత్నాన్ని నేను వ్యతిరేకిస్తానని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినీ నటులు రాజకీయాల్లో గెలవడం అంత సులువు కాదు.. రాజకీయం అనేది అత్యంత కష్టమైన వ్యవహారం, ఇక్కడ అందరూ శత్రువులే.. అన్నారు.