ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రదాడి..72మంది మృతి..!

-

ఆఫ్గ‌నిస్తాన్ లో ఖోరాస‌న్ ఐఎస్ఎస్ ఖోరాస‌న్ తీవ్ర‌వాదులు ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డారు. కాబూల్ విమానాశ్ర‌యం వెలుప‌ల తీవ్ర‌వాదులు ఈ దాడికి దిగారు. ఈ బాంబ్ బ్లాస్ట్ లో అమెరికన్ సైనికులు మ‌ర‌ణించ‌గా…60 మందికి పైగా ఆఫ్గ‌నిస్తాన్ పౌరులు మ‌ర‌ణించారు. అంతే కాకుండా ఈ దాడిలో 150 మంది గాయపడ్డారు. అత్మాహుతి దళం సభ్యులు వరుసగా మూడు సార్లు దాడులకు తెగపడినట్టు సంచారం.

అంతే కాకుండా అమెరికా సైనికులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్ ఈ దాడి చేసినట్టు వెల్లించారు. ఇక దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ రాత్రి మూడు గంటలకు మీడియా ముందుకు వచ్చారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆఫ్గనిస్తాన్ ను తమ ఆధీనం లోకి తీసుకున్న తాలిబన్లు దారుణాలను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version