కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కల్వకుంట్ల కవితనే కారణం అంటూ బాంబ్ పేల్చారు. ఒక సీఎం కూతురు లిక్కర్ స్కాం చేయడం, జైలుకు వెళ్లడం నాకు బాధ కలిగించిందని ఎద్దేవా చేశారు కడియం శ్రీహరి.

కల్వకుంట్ల కుటుంబం తెలంగాణపై పడి దోచుకుందని ఆగ్రహించారు. దోచుకున్న డబ్బును పంచుకోవడంలో ఇబ్బంది వచ్చినందుకే ఈ పంచాయితీలు అంటూ విమర్శలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దీంతో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై…. బీఆర్ ఎస్ పార్టీ అలాగే కవిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.