తీగ లాగినా కొద్దీ డొంక కదులుతోంది అన్నట్టుగా డ్రగ్స్ రంగుల ప్రపంచం వెనకున్న నీలినీడలు బట్టబయలవుతున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ అనుమానాస్పద మృతి తరువాత రియా ప్రధాన అనుమానితురాలిగా మారింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ రియాని ప్రశ్నించడం, ఆ క్రమంలో ఆమెకు బాలీవుడ్ డ్రగ్ పెడ్లర్‌లతో సంబంధాలున్నాయని తేలడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. దీంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ దందా ఏ స్థాయిలో వేళ్లూనుకుందో ఒక్కక్కటిగా బయటికి రావడం మొదలైంది.
ఇదే సమయంలో శాండల్ వుడ్‌లో డ్రగ్స్ కలకలం మొదలైంది. కన్నడ ఇండస్ట్రీలోనూ డ్రగ్ కల్చర్ వుందని తేలిపోయింది. హీరోయిన్ రాగిణి దివ్వేదితో పాటు సంజనకు ఈ డ్రగ్స్ తో సంబంధాలున్నయాని ఎన్‌సీబీ పోలీసులు గుర్తించి ఈ ఇద్దరిని వరుసగా అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రస్తుంత విరిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇదిలా వుంటే డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న సంజనతో కలిసి కాజల్ అగర్వాల్ కాసినోకు వెళ్లడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫొటో చాలా రోజుల క్రితం తీసిందని, కాసినో ప్రమోషన్‌లో భాగంగా ఈ ఇద్దరు హీరోయిన్‌లు పాల్గొనగా తీశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కాజల్ వవరణ ఇస్తేగానీ అసలు విషయం ఏంటనేది బయటికి రాదనే వాదన కూడా వినిపిస్తోంది. కాజల్ స్పందిస్తుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.