కోవిడ్ వ్యాక్సిన్: ప్రపంచానికి ఇండియా సాయం కావాలి.. బిల్ గేట్స్.

-

కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నది దీనికోసమే. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ వైరస్ మనల్ని విడిచుపెడుతుందా, ఎప్పుడెప్పుడు సాధారణ స్థితికి వస్తామా అని చూస్తున్నారు. మొన్నటికి మొన్న కరోనా వ్యాక్సిన్, వచ్చే సంవత్సరం మార్చి నాటికి వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలియజేసాడు. ఇండియాలో అస్ట్రాజెంకా రూపొందిస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తో పాటు భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి.

అయితే కరోనా వ్యాక్సిన్ తయారు చేయడంలో ఇండియా అవసరం ప్రపంచానికి ఉందని ప్రపంచ కుబేరులలో ఒకరైన బిల్ గేట్స్ అంటున్నాడు. ఒకానొక ఇండియా న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పై మాట్లాడాడు. ప్రపంచంలో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే ఇండియా అవసరం ఉందంటున్నాడు. అభివృద్ధి చేందుతున్న దేశాలకి వ్యాక్సిన్ సప్లై చేయడంలో ఇండియాది కీలక పాత్ర ఉంటుందని చెబుతున్నాడు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి ప్రస్తుతం జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ అన్నీ పూర్తవుతాయని, తర్వాత ప్రపంచ దేశాలకి వ్యాక్సిన్ ని సప్లై చేసేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసాడు.

సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ పనులని వేగవంతం చేయడానికి బిల్ గేట్స్ ఛారిటీ సంస్థ మిలిందా గేట్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news