కాజల్ ప్రెగ్నెంట్..త్వరలోనే గుడ్ న్యూస్..?

-

టాలీవుడ్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ స్పీడు తగ్గిందనే చెప్పాలి. సినిమాలు తక్కువ చేస్తూ కాజల్ ఫ్యామిలీకి ఎక్కువ దగ్గరగా ఉంటుంది. నాగార్జునతో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్న కాజల్ ఆ తర్వాత మళ్లీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దాంతో కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అంటూ పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై కాజల్ అగర్వాల్ స్పందించలేదు.

కానీ తాజాగా కాజల్ చేసిన పోస్ట్ చూస్తుంటే ఆ వార్తలు నిజమే అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కాజల్ తన సోషల్ మీడియాలో త్వరలో ఒక శుభవార్త చెబుతానంటూ పోస్ట్ పెట్టింది. దాంతో కాజల్ ప్రెగ్నెంట్ అంటూ మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. అయితే కాజల్ ఏం చెబుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ మెగాస్టార్ హీరోగా నటించిన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news