చిరు పక్కన మళ్ళీ కాజల్ ని ఫైనల్ చేసారా…?

-

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా వస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా లో ఈ మూవీ కి సంబంధించి చిరు లుక్ ఒకటి లీక్ అయ్యి సందడి చేస్తోంది. ఈ లుక్ చూసిన అభిమానుల్లో చిరంజీవి మావోయిస్ట్ గా చేయబోతున్నారు అని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో మెగా హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో గతంలో స్టాలిన్ సినిమాలో చిరంజీవి సరసన నటింటిన త్రిష ను హీరోయిన్ గా ఎంపిక చేశారట, కానీ సినిమాకు సంబందించి కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా నుండి తను తప్పుకున్నట్లు ట్విట్టర్ ద్వారా త్రిష తెలియజేశారు. దీంతో చిరంజీవి కి జోడీ గా 150 వ సినిమాలో చేసిన కాజల్ ను ఎంపిక చేశారు.

త్వరలో కాజల్ కూడా ఈ మూవీ షూటింగ్ లో బిజీ అవ్వబోతున్నారు. దీనితో పాటు ఈ చిత్రం లో ఒక స్పెషల్ సాంగ్ కోసం రెజీనాను ఎంపిక చేశారట. రెజీనా తొలిసారిగా ఈ చిత్రం ద్వారా స్పెషల్ సాంగ్ లో నటించబోతుంది. ఈ పాటను ఆరు రోజుల పాటు చిత్రించడం జరిగిందని సమాచారం. చాలా రోజుల తర్వాత చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news