Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్స్ గెట్‌ రెడీ.. కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ టైం చెప్పిన నాగ్‌ అశ్విన్‌

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని 2024లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.నాగ్‌ అశ్విన్‌ ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్‌ కోసం ఈరోజు ఐఐటీ బాంబే TECH FEST 23లో భాగంగా కాన్వొకేషన్‌ హాల్‌లో చిట్‌ చాట్‌లో పాల్గొన్నాడు. అయితే ఈ ఈవెంట్‌లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కల్కి ట్రైలర్‌ ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ ట్రైలర్‌ను 2024 ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అంటే ఇవాళ్టి నుంచి 93 రోజులలో ట్రైలర్‌ వస్తుందన్నమాట.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే , దిశా పటానీ, లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్‌ (యూనిఫార్మ్‌డ్‌ విలన్‌ ఆర్మీ) కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది .ఈ మూవీని సీ అశ్వనీదత్‌ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news