Kalki 2898AD: రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ చారిత్రాత్మక డేట్‌కే!

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ . వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. 2023 లో శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న సంగతి తెలిసిందే.

పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ అనగానే గుర్తొచ్చే చిత్రాలు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’. వేరు వేరు సంవత్సరాలలో విడుదలైనప్పటికీ.. ఈ రెండు చిత్రాలు రిలీజ్ అయిన తేదీ మాత్రం ఒకటే మే 9. అందుకే ఈ తేదీన ప్రభాస్‌తో చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’ని కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఈ పోస్టర్‌లో ‘కల్కి’ అవతార్‌లో ఓ సూపర్ హీరోలా ప్రభాస్ కనిపిస్తోన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news