బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్ లో ఉండదు : కేటీఆర్

-

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు. భవిష్యత్ లో ఉండదన్నారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. ఇకపై పార్టీ చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉంటుందన్నారు.

పార్టీ క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలిపారు. బీఆర్ఎస్ కి బీజేపీ బీ టీమ్ అయితే.. ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా..? అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్పా.. బీజేపీతో సంబంధాలు కారణం కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి, బీఆర్ఎస్ ను ఓడించాయని పేర్కొన్నారు. బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటుందని విమర్శించారు. తాము కూడా యాదాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిల్లో పంచితే గెలిచే వాళ్లమేమో అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news