వింత వ్యాధి కాదది.. అసలు విషయం అదేనా ?

-

వికారాబాద్ జిల్లా నవాబు పేట మండలంలోని 11  గ్రామాల్లో ఇప్పటి వరకు 150 మంది వరకు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. అయితే ముందు నుండీ ఇదేదో వింత వ్యాధి అని టెన్షన్ పడినా కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన రైతు కృష్ణా రెడ్డి పరిస్తితి విషమంగా ఉండటంతో నగరానికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇక మొత్తం మీద 11 గ్రామాలకు చెందిన 150 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. విషమంగా ఉన్న ముగ్గురిని హైదరాబాద్ తరలించారు.

మిగతావారిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పోలీసులు వైద్య బృందం పర్యటిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిని జిల్లా ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. ఇక కల్లు దుకాణాలను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు, కల్లు తాగొద్దని డప్పు కొట్టి చాటింపు వేయిస్తున్నారు. కల్లు నమూనాను సేకరించి పరీక్షలకు కూడా పంపారు. కల్తీకల్లు కారణంగానే ఒకరు మృతి చెందారు… 50 మందికి పైగా ఆస్పత్రిలో చేరారని,  పోస్టుమార్టం రిపోర్ట్, ఎక్సైజ్ అధికారుల రిపోర్ట్ రావాలని, ఆస్పత్రిలో చేరిన వాళ్ళతో మాట్లాడాను. కల్లు తాగినట్టుగా చెప్తున్నారని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news