కళ్యాణ్ రామ్” బింబిసార “మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్

-

నందమూరి హీరోల్లో హిట్, ఫ్లాప్ లకు సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే హీరో కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం “బింబిసార”. ఈ సినిమాను ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పిరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్ లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం మగధీర లెవెల్లో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న టాక్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బింబిసార మూవీ థియేట్రికల్ ట్రైలర్ జూలై 4 వ తేదీన విడుదల కానుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వీడియో గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news